షిరిడి పురవాస శ్రీ సాయినాథా....
జగమేలు మా తండ్రి సాయినాథా
బ్రతుకు చీకట్లను తొలగించు సాయినాథా....
వెలుగు రేఖల్ని నింపేవు సాయినాథా
ఈ వేళ ఆ వేళ ఏల సాయినాథా...
అన్ని వేళలా మాతోటి ఉండు సాయినాథా /షిరిడి పురవాస/
ఈ మాట ఆ మాట ఏల సాయినాథా...
మా ప్రతి మాట నీ పాట కావాలి సాయినాథా /షిరిడి పురవాస/
ఇచ్చోట అచ్చోట ఏల సాయినాథా...
మా ఎద చోట కొలువుండు సాయినాథా /షిరిడి పురవాస/
ఈ జన్మ ఆ జన్మ ఏల సాయినాధా...
మా ప్రతి జన్మలోన వెంటుండు సాయినాథా...
మము నడిపించు సాయినాథా...
షిరిడి పురవాస శ్రీ సాయినాథా....
జగమేలు మా తండ్రి సాయినాథా
బ్రతుకు చీకట్లను తొలగించు సాయినాథా....
వెలుగు రేఖల్ని నింపేవు సాయినాథా
షిరిడి పురవాస శ్రీ సాయినాథా....
జగమేలు మా తండ్రి సాయినాథా
ఓం శ్రీ సాయిరాం
🙏🙏🙏
-తేజ