సాయి...
నేను పలకరించడం లేదని నువ్వు నాతో మాట్లాడటం మానేయకు సాయి...నా ప్రతి మాట మాటలో నీవే నిండి ఉండోయి
నేను నిన్ను తలవడం లేదని నువ్వు నన్ను మరువకు సాయి... నా ప్రతి సెకను సెకనులో నీవే నిండి ఉండోయి
నేను నీ చేయి విడిచానని నీవు నా చేయి విడిచేయకు సాయి....నా ప్రతి అడుగు అడుగులో నీవే నిండి ఉండోయి
నేను నీ బాటలో అడుగు వేయట్లేదని నీవు నన్ను వదిలేయకు సాయి...నా ప్రతి బాట బాటలో నీవే నిండి ఉండోయి
నేను ఏ జన్మలోనైనా నిన్ను మరుస్తానేమో....నీవు మాత్రం నన్ను మరువకు సాయి...నా ప్రతి జన్మ జన్మలో నీవే నిండి ఉండోయి
ఈ అక్షరాల సాక్షిగా.....ఇది నా విన్నపమోయి
ఓం శ్రీ సాయిరాం
🙏🙏🙏
-తేజ
No comments:
Post a Comment