నిన్నే తలచిన ప్రతిసారి
కదిలేను మా దేహరథం నీకు దగ్గరగా
వెడలేను మా మనోరథం దుర్గుణములకు దూరంగా
నీ నామము పలికిన ప్రతిసారి
చేరనీ మమ్ము నీ తత్వ రథాలకు దగ్గరగా
మరి ఈ లౌకిక రథాలకు దూరంగా
నిన్నే కొలిచిన ప్రతిసారి
వెడుతోంది నా ఆత్మ రథం ఓ మెట్టు ఉన్నతిగా
పడుతోంది ఈ దేహ రథం నీ ముందు ఓ దండముగా
నీ రూపాన్ని కనిన ప్రతిసారి
కదిలేను నా విశ్వాసమన్న అశ్వ రథం నీకు చేరువగా
ఓలలాడనీ సాయి రథంలో ఎన్నటికీ పదిలముగా
ఓం శ్రీ సాయిరాం
🙏🙏🙏
-తేజ