నీ నుండి నన్ను దూరం పెట్టే నా అహానికి చెప్పా... సాయికి నన్ను దగ్గర చేసే నా సాయిప్రేమ చాలా బలీయమైనదని
నీ నుండి నన్ను దూరం చేసే నా దుష్కర్మలకు చెప్పా... సాయికి నన్ను దగ్గర చేసే నా సాయికరుణ చాలా బలీయమైనదని
నీ నుండి నన్ను దూరం చేసే నా దురాలోచనలకి చెప్పా... సాయికి నన్ను దగ్గర చేసే నా సాయినామ స్మరణ చాలా బలీయమైనదని
నీ నుండి నన్ను దూరం చేసే నా చాంచల్యానికి చెప్పా... నా సాయికి నన్ను దగ్గర చేసే నా సాయిబంధం చాలా బలీయమైనదని
నీ నుండి నన్ను దూరం చేసే నా అజ్ఞానానికి చెప్పా... నా సాయికి నన్ను దగ్గర చేసే నా సాయిలీల చాలా బలీయమైనదని
నీ నుండి నన్ను దూరం చేసే నా అరిషడ్వర్గాలనే రోగాలకి చెప్పా... నా సాయికి నన్ను దగ్గర చేసే నా సాయివైద్యం చాలా బలీయమైనదని
ఓం శ్రీ సాయిరాం
🙏🙏🙏
-తేజ
Click here to see Saibaba puja with 108 types of flowers