బాబా...
తొలిసారి నిన్ను దర్శించినపుడు
నే పొందిన ఆనందం వర్ణనాతీతం
కనులారా నీ కన్నుల కాంతి కాంచినపుడు
నే పొందాను తన్మయత్వం
తనివితీరా నీ చరితామృతం గ్రోలాక
తెలిసింది నీ దివ్యత్వం
నోరారా నీ నామజపం చేశాక
తెలిసింది అమృతత్వం
ప్రియమారా నీ వాక్కులప్రేమ గ్రోలాక
పొందాను ఆనందపారవశ్యం
మనసారా నీ పాదదర్శనం చేశాాక
తెలిసింది నా శాంతిథామం
ఓం శ్రీ సాయిరాం🙏🙏🙏
-తేజ
Sairam🙏🙏🙏
ReplyDeleteఅధ్భతసయ్య:
ReplyDeleteThank you🙏🙏
Delete