బాబా...
జాగృదావస్తలో ఉన్న ప్రతిజీవిలోని చైతన్యశక్తివి నీవే
నిద్రాణస్థితిలో ఉన్న ప్రతి వస్తువులోని చైతన్య శక్తివీ నీవే
నీలోని ఆ చైతన్య శక్తికి నా వందనం
విశ్వమంతా నిండిన నీ హృదయంలో
కరుణతో నన్ను ఉండనిచ్చావు
పిడికెడైనా లేని నా హృదయంలో నిన్ను బంధించినా
కరుణతో నీవున్నావు
నీలోని ఆ కారుణ్యానికి నా వందనం
నీకు నాకు మధ్య ఉన్న దుర్గుణాల గోడను కూల్చమన్నావు
నన్ను నీ దరి కి చేర్చే సుగుణాల మేడను కట్టమన్నావు
గుణాతీతుడవైన నీకు నా వందనం
నీపై ఓరిమితో నమ్మకం ఉంచమన్నావు
మార్గము నీవై భవసాగరాలనే దాటిస్తానన్నావు
మార్గదర్శకుడవైన నీకు నా వందనం
నీ నామ స్మరణమే పాపహరణం అన్నావు
నీ పాదకమలాల మధువుని భ్రమరమై అందుకోమన్నావు
దయామూర్తివైన నీకు నా వందనం
నీ రూపాన్ని సదా నా హృదయంలో నిలుపమన్నావు
ప్రేమతో నన్ను నీ దరి చేర్చుకున్నావు
ప్రేమైకమూర్తివైన నీకు నా పాదాభివందనం
ఓం శ్రీ సాయిరాం🙏🙏🙏
-తేజ
No comments:
Post a Comment