Saturday, 25 July 2020

41 సాయి భజన



సాయి నామమే సదా మననము

ఆతని దివ్య రూపమే బహు మధురము


సాయి స్మరణమే సర్వపాపహరణము

ఆతని ప్రేమ వాక్కులే ముక్తి మార్గము


సాయి లీలలే దీపకాంతులు

ఆతని అభయహస్తమే భక్తులకి మనోధైర్యము


సాయి భజనలే మనోరధ దాయకం

ఆతని చల్లని చూపులే మహానంద భరితం


సాయి గానమే మహా పుణ్య ఫలం

ఆతని దరహాసమే జగద్రక్షణం


సాయి దర్శనం అది దివ్య దర్శనం

ఆతని చరణారవిందమే సదా పూజనీయం


ఓం శ్రీ సాయిరాం

🙏🙏🙏


-తేజ


40 ‌సాయి వెన్నెల



బాబా…


వెన్నెలంటి నీ చూపును మాపై కురిపించు

సాయీ….వెన్న వంటి నీ మనసుని మాపై కరిగించు


అమ్మ వంటి నీ ప్రేమను మాపై చూపించు

సాయీ….అమృతము వంటి నీ దీవెన మాపై కురిపించు


దీపమల్లే మా దారిలో వెలుగును చూపించు

సాయీ….మంచు వంటి నీ మనసుతో మాపై క్షమనే కురిపించు


మేఘమల్లె నీ కరుణను మాపై వర్షించు

సాయీ….మాయ వడిలో చిక్కుకున్న మమ్ము సదా రక్షించు


ఓం శ్రీ సాయిరాం

🙏🙏🙏


-తేజ

Sunday, 19 July 2020

39 సాయి తేజస్సు

బాబా...

మా శిరస్సు ఎల్లవేళలా నీ పాదాలపై ఉండనీ
నీ కరములు ఎల్లవేళలా మా శిరము పై ఉండనీ

మా మనస్సు ఎల్లవేళలా నీ వదనముపై ఉండనీ
నీ చూపులు ఎల్లవేళలా మా దేహాత్మలపై ఉండనీ

మా ఆలోచనలు ఎల్లవేళలా నీ వైపే సాగనీ
నీ ఆశీస్సులు ఎల్లవేళలా మా వెన్నంటే సాగని

మా తపస్సు ఎల్లవేళలా నీ కరుణ కోసం సాగనీ
నీ ఓజస్సు ఎల్లవేళలా రక్షణ కవచాలై మము చుట్టేయనీ

మా తమస్సు ఎల్లవేళలా నీ పాదాల చెంత తొలగనీ
నీ తేజస్సు ఎల్లవేళలా మాపై మెండుగా కురవనీ

ఓం శ్రీ సాయిరాం
🙏🙏🙏

-తేజ

38 సాయి సర్వాంతర్యామి

బాబా…

ఆదియు నీవే, అంతము నీవే
ఆది అంతముల నడుమ ఉన్నది నీవే, లేనిదీ నీవే
ఉండీ లేనట్టి సర్వమూ నీవే

సృష్టివి నీవే, లయవీ నీవే 
సృష్టి లయల నడుమ ఉన్న స్థితివీ నీవే, 
స్థితి కారుడవూ నీవే

ఉదయము నీవే, అస్తమయము నీవే
ఉదయాస్తమయముల నడుమ కదిలే మా ఎద లయవు నీవే
లయకారుడవూ నీవే

ఆత్మవు నీవే, అంతరాత్మవు నీవే
ఆత్మలను, అంతరాత్మలను సృష్టించిన పరమాత్మవు నీవే
సర్వాంతరాత్మవూ నీవే

ఓం శ్రీ సాయిరాం
🙏🙏🙏

-తేజ

Thursday, 16 July 2020

37 సాయి నివేదన

బాబా...
ఇంత గొప్ప, అంత గొప్ప అన్న పేరు నాకొద్దు,
అశాశ్వతమైన ఈ లోకంలో
ఇంతైనా, ఎంతో కొంతైనా ఓ మంచి పేరు కావాలి
శాశ్వతమైన నీ దర్బార్లో

ఇంత మంచి, అంత మంచి అని నా గురించి
ఎప్పుడూ చెప్పను నీతో మాటల్లో
ఇంతైనా, ఎంతో కొంతైన నాలో ఎంత మంచి ఉందో
చెప్పగలవు నీవు తూకపు లెక్కల్లో

ఇంత చేసా, అంత చేసా అని నేను
ఎన్నడూ చెప్పుకోను ఎవ్వరికీ
ఇంతైనా, ఎంతో కొంతైనా ఓ మంచి చేయగలిగే
గీతనివ్వు ఈ చేతులకి

ఇంత ఇవ్వు, అంత ఇవ్వు అని నేను
కోరను నిన్ను ఎన్నటికీ
ఇంతైనా, ఎంతో కొంతైనా ఓ చోటు మాత్రం ఇవ్వు
నీ పాదాల చెంత ఎప్పటికీ

ఓం శ్రీ సాయిరాం 
🙏🙏🙏

-తేజ

Tuesday, 14 July 2020

36 సాయి పాదము



సాయి పాదము, అది భవ్య పాదము 2
నమ్మి కొలిచిన వారికి కొంగు బంగారము
సాయి పాదము, అది భవ్య పాదము 2

మాయను దాటించే మహోన్నత పాదము
జీవాత్మలను నడిపించే దివ్య పాదము

షిరిడీ పుణ్య భూమిని ముద్దాడిన పాదము 
గంగా యమునలు కొలువుండిన ధన్య పాదము

భక్తుల కోరికలు ఈడేర్చే అరుదైన పాదము
పుణ్య నదులు సైతము కోరే పరమ పుణ్య పాదము

అజ్ఞాన చీకట్లను తొలగించే అద్భుత పాదము
లెండీ వనములో విహరించిన వెలకట్టలేని పాదము

భవ జలధిని దాటించే భవ్యమైన పాదము
భక్తి లోకంలో విహరింప చేసే బంగారు పాదము

ప్రేమ మధువు ఉప్పొంగే స్వర్ణపద్మ పాదము
మోక్షమార్గమును చూపించే మహోన్నత పాదము

సాయి పాదము, అది భవ్య పాదము 2
నమ్మి కొలిచిన వారికి కొంగు బంగారము
సాయి పాదము, అది భవ్య పాదము 2

ఓం శ్రీ సాయిరాం
🙏🙏🙏

-తేజ

Monday, 13 July 2020

35 సాయి తలపు


బాబా...ఓ…..బాబా
పలికే నా పెదవులే కాదు పలక లేని నా మది సైతం
నిరంతరం నిన్నే పిలవాలి 
నిరంతరం నిన్నే తలవాలి

బాబా...ఓ‌‌... బాబా
చూసే నా కన్నులే కాదు చూడలేని నా మది సైతం
నిరంతరం నిన్నే చూడాలి
నిరంతరం నిన్నే చేరాలి

బాబా...ఓ... బాబా
గడిచే ఈ క్షణమే కాదు గడవబోయే నా ప్రతీ క్షణం
నిరంతరం నీతో సాగాలి
నిరంతరం నిన్నే తలవాలి

బాబా...ఓ….బాబా
విరిసే ఆ కుసుమాలే కాదు విలువలేని నేను సైతము, 
విలువలేని నేను సైతము
నిరంతరం నిన్నే తాకాలి
నిరంతరం నీతో ఉండాలి

ఓం శ్రీ సాయిరాం
🙏🙏🙏

-తేజ

101 సాయి నన్ను విడువకు

  సాయి... నేను పలకరించడం లేదని నువ్వు నాతో మాట్లాడటం మానేయకు సాయి...నా ప్రతి మాట మాటలో నీవే నిండి ఉండోయి  నేను నిన్ను తలవడం లేదని నువ్వు నన్...