Monday, 10 August 2020

49 సాయి పంచపూజ

 

సాయికి గంధము చేద్దాము

సాయి నుదుటిన పెడదాము

ప్రేమను మనసు నుండి తీద్దాము

భక్తిని దానికి రంగరిద్దాము

సాయికి గంధము చేద్దాము

సాయి నుదుటిన పెడదాము


సాయికి మాలను చేద్దాము

సాయి మెడలో వేద్దాము

కొన్ని ప్రేమ‌పూలను తెద్దాము

భక్తి దారమునకు విశ్వాసముగ చుడదాము

సాయికి మాలను చేద్దాము

సాయి మెడలో వేద్దాము


సాయికి వస్త్రము చేద్దాము

సాయి ఒడలికి చుడదాము

భక్తి దారమును తెద్దాము

ప్రేమ మగ్గముకు కడదాము

సాయికి వస్త్రము చేద్దాము

సాయి ఒడలికి చుడదాము


సాయికి ధూపమును చేద్దాము

సాయి ముందర వేద్దాము

ప్రేమ సాంబ్రాణి తెద్దాము 

భక్తి నిప్పుకి జోడిద్దాము

సాయికి ధూపమును చేద్దాము

సాయి ముందర వేద్దాము


సాయి జ్యోతిని వెలిగిద్దాము

సాయి ముందర పెడదాము

ప్రేమ ఒత్తిని చేద్దాము 

భక్తి నూనెను పోద్దాము

సాయి జ్యోతిని వెలిగిద్దాము

సాయి ముందర పెడదాము


సాయికి నివేదన చేద్దాము

సాయికి గోరుముద్దలు పెడదాము

భక్తి, ప్రేమలను కలుపుదాము

వాటితో స్వచ్ఛ మనసనే కిచిడీ చేద్దాము

సాయికి నివేదన చేద్దాము

సాయికి గోరుముద్దలు పెడదాము


సాయి పంచపూజను చేద్దాము

సాయి సేవ‌ను చేద్దాము

సాయి సేవను చేద్దాము


ఓం శ్రీ సాయిరాం

🙏🙏🙏


-తేజ

No comments:

Post a Comment

101 సాయి నన్ను విడువకు

  సాయి... నేను పలకరించడం లేదని నువ్వు నాతో మాట్లాడటం మానేయకు సాయి...నా ప్రతి మాట మాటలో నీవే నిండి ఉండోయి  నేను నిన్ను తలవడం లేదని నువ్వు నన్...