రారండి రారండి సాయి భక్తులారా రారండి
రారండి రారండి సాయి బిడ్డలారా రారండి
ఆణిముత్యమంటి మన సాయికి మేలిమి ముత్యాల హారమె వేద్దాము
జాతిరత్నమంటి మన సాయికి నవరత్నాల హారమె వేద్దాము
రారండి॥
చంద్రుడంటి చల్లనైన సాయికి చంద్ర హారమె వేద్దాము
కరుణ కాసుల్ని కురిపించే సాయికి కాసుల హారమె వేద్దాము
రారండి॥
వెన్న వంటి మనసున్న సాయికి వెండిపూల హారమె వేద్దాము
వర్ణభేదమెరుగని మన సాయికి సువర్ణ హారమె వేద్దాము
రారండి॥
వెన్నెల వెలుగులు చిమ్మే మన సాయికి వెన్నెల హారమె వేద్దాము
పూల మారాజైన మన సాయికి పూల హారమె వేద్దాము
రారండి॥
ప్రేమ మూర్తైన మన సాయికి ప్రేమలహారమె వేద్దాము
మనసెరిగిన మన సాయికి మన మనసుల హారమె వేద్దాము
రారండి రారండి సాయి భక్తులారా రారండి
రారండి రారండి సాయి బిడ్డలారా రారండి
ఓం శ్రీ సాయిరాం
🙏🙏🙏
-తేజ
No comments:
Post a Comment