సాయి సాయి సాయి అనుచు సాయిని పిలువరే
సాయి సాయి సాయి అనుచు సాయిని తలువరే
సాయి సాయి సాయి అనుచు నిద్దుర లేవరే
సాయి దివ్య రూపాన్ని కనులారా చూడరే
సాయి సాయి సాయి అనుచు శ్వాసను పీల్చరే
సాయిని మది నిండా నిలిపి నిత్యం కొలువరే
సాయి సాయి సాయి అనుచు పూజను చేయరే
సాయికి మనసారా సేవలు చేయరే |సాయి|
సాయి సాయి సాయి అనుచు నిత్యము పలుకరే
సాయిని ప్రతి జీవిలోన గాంచి తరియించరే
సాయి సాయి సాయి అనుచు ఊది ధరియించరే
సాయి ఆశీసులను పొంది నిత్యం సుఖించరే
సాయి సాయి సాయి అనుచు చరితను చదవరే
సాయి అన్నివేళల్లోన మన వెంట నిలచునే |సాయి|
సాయి సాయి సాయి అనుచు సత్సంగము చేయరే
సాయి లీలలని గాంచి తరియించరే
సాయి సాయి సాయి అనుచు ప్రేమను పంచరే
సాయి ప్రేమను మనసారా జుర్రుతు తాగరే |సాయి|
సాయి నామమే ఔషధిగా మనసారా సేవించరే
సాయి నామమే మన భవ రోగాలను పారద్రోలునే
సాయి నామాన్ని భక్తిగ, భుక్తిగ గ్రహించరే
సాయి శక్తిని అణువణువున పొందరే
సాయి సాయి సాయి అనుచు సాయిని పిలువరే
సాయి సాయి సాయి అనుచు సాయిని తలువరే
ఓం శ్రీ సాయిరాం
🙏🙏🙏
-తేజ