సాయీ....
చేరాలని ఉంది....చూడాలని ఉంది....
ఎవ్వరూ చూడలేని...మరెవ్వరూ చేరలేని ఓ సాయి మందిరమొకటి ఉందని తెలిసే
ఒక్క చోట ఉండదట...ఘడియకో తావు చేరునట
వేగంగా వెళ్ళునట....ఊరూరు తిరిగేనట
కనురెప్పలు మూస్తేనే ఈ వీక్షణం సాధ్యమట
మనసు తలుపులు తెరిస్తే తక్షణం లభ్యమట
శ్వాస మీద ధ్యాసతో...
శ్రద్ధా, సబూరీ ధ్యేయంతో
చీకటని చీకాకు పడక....
సవ్వడే లేదని డీలా పడక అలా మున్ముందుకు సాగగా సాగగా...
చివరాఖరికి,
చేరితిని చేరితిని ఓ దివ్య మందిరాన్ని
చూచితిని చూచితిని ఓ వెలుగు రేఖని
కలలోన కాదు, ఇలలోన కాదు
చీకటి కోనలోన ఓ దివ్వెవోలె
రాతిరిలోన చందురూనివోలె
నా హృద్మందిరంలోన దైవంవోలె
మన సాయి తండ్రిని...మన ప్రేమైక మూర్తిని 🙏🙏🙏
ఓం శ్రీ సాయిరాం
🙏🙏🙏
-తేజ
No comments:
Post a Comment