సాయీ నే చేరితి నీ పాదకమలము....అది మధువులొలుకు దివ్యకమలము
సాయీ నే చేరితి నీ పాదకమలము...ఎన్నటికీ తీరనిది నా భ్రమర తృష్ణము
సాయీ నీ పాద కమలము చూసినంతనే కలుగు పుణ్యము...మరి తొలగు పాపము
సాయీ నీ పాద కమలము తాకినంతనే కలుగు అభయము...మరి తొలగు అధైర్యము
సాయీ నీ పాద కమలము పట్టినంతనే కలుగు హర్షము...మరి తొలగు భారము
సాయీ నీ పాద కమలము శిరమున నిలిపినంతనే కలుగు విశ్వాసము...మరి తొలగు ద్వైతము
సాయీ నీ పాద కమలము హృదిలో నిలిపినంతనే కలుగు విజయము...మరి తొలగు శోకము
సాయీ నే చేరితి నీ పాదకమలము....అది మధువులొలుకు దివ్యకమలము
సాయీ నే చేరితి నీ పాదకమలము...ఎన్నటికీ తీరనిది నా భ్రమర తృష్ణము
ఓం శ్రీ సాయిరాం 🙏🙏🙏
- తేజ
No comments:
Post a Comment