బాబా...
నువ్వున్నావన్న నమ్మకంతో నేను చేరాను నీ దరికి
నేనున్నాని నువ్వు చూపిస్తున్నావు ప్రతి క్షణం నీ ఉనికి
నువ్వున్నావన్న నమ్మకంతో నడిపిస్తున్నాను ఈ దేహరధాన్ని
నేనున్నాని నువ్వు అందిస్తున్నావు ప్రతి క్షణం నీ దీవెనలవరాన్ని
నువ్వున్నావన్న నమ్మకంతో నా శిరమును వాల్చాను నీ పాదాలపై
నేనున్నాని నువ్వు మోస్తున్నావు నా భారాలను నీ భుజాలపై
నువ్వున్నావన్న నమ్మకంతో జీవిస్తున్నాను నీపై ఒరిగి ఒరిగి
నేనున్నాని నువ్వు అందిస్తున్నావు నీ ప్రేమను కొసరి కొసరి
ఓం శ్రీ సాయిరాం 🙏🙏🙏
-తేజ
No comments:
Post a Comment