బాబా...
బాబా నువ్వున్నది నిజమే ఐతే... అని నేను అనను
నీ ఉనికి నాకిలా అనుక్షణం
తెలుస్తున్నంత వరకు
బాబా నీ మహిమలు నిజమే ఐతే..అని నేను అనను
నీ మహిమల శక్తి నన్నిలా నిరంతరం
చుట్టేస్తున్నంత వరకు
బాబా నీ వాక్కులు నిజమే ఐతే...అని నేను అనను
నీ వాక్కుల శక్తి నన్నిలా ప్రతిక్షణం
పలకరిస్తున్నంత వరకు
బాబా నీ దీవెనలు నిజమే ఐతే...అని నేను అనను
నీ దీవెనల దివ్యశక్తి నన్నిలా క్షణక్షణం
రక్షిస్తున్నంత వరకు
బాబా "నీ భక్తి నిజమే ఐతే" అని నువ్వు నన్ను అనకు
నిన్నే నమ్మి నేనిలా
జీవిస్తున్నంత వరకు 🙏
బాబా "నీ ప్రేమ నిజమే ఐతే" అనీ నువ్వు నన్ను అనకు
నిన్నే నమ్మి నేనిలా
శ్వాసిస్తున్నంతవరకు 🙏
ఓం శ్రీ సాయిరాం 🙏🙏🙏
-తేజ
No comments:
Post a Comment