బాబా...
తలచినదే తడవుగా కనిపించేవు
మది పిలిచినదే తడవుగా అగుపించేవు
ఏ చోట నేనున్నా తలచిన వెంటనే చిత్రంగా
కనిపించేను నీ చిత్రం
ఏ ధ్యాసలో నేనున్నా మైమరపు కమ్మిన వెంటనే
చూపించేవు నీ అస్తిత్వం
ఎప్పుడు నే ధ్యానం చేద్దామని కూర్చున్నా,
రెప్ప మూసిన వెంటనే కనిపించేను నీ రూపం
ఎప్పుడు నా దేహం కష్టానికి గురి కాబోతున్నా, పెదవులు వెంటనే పలికేను నీ నామం
ఏ సంతోషంతో నేను పులకరిస్తున్నా,
ఎదలో పరుగాపక జరిగేను నీ స్మరణం
ఏ వ్యధ నన్ను పలకరిస్తున్నా,
ఎద లోతుల్లో నేనున్నానంటూ వినిపించేను నీ స్వరం
ఎప్పుడు,ఎక్కడ, ఏ స్థితిలో నేనున్నా,
ఎన్నడూ నా వెంటే ఉండి నన్ను రక్షిస్తున్న నా సాయీ
నీకివే నా కృతజ్ఞతాభివందనాలు
ఓం శ్రీ సాయిరాం 🙏🙏🙏
-తేజ
No comments:
Post a Comment