బాబా...
మసీదులో వెలిగించావు దీపజ్యోతులను నీటితో...
మాలో వెలిగించావు జ్ఞానజ్యోతులను నీ మాటతో...
రాతి నుండి నీటినే పుట్టించావు నీ సటకా దెబ్బతో...
రాతి మనసులలో కరుణనే పుట్టించావు నీ దివ్య బోధతో...
ఉప్పునీటిని సైతం శుద్ధ జలముగ మార్చావు కొన్ని పూలతో...
ఉప్పని మా కన్నీటిని ఆనందభాష్పాలుగా మార్చావు నీ పిలుపుతో....
పంచభూతాలనే ఆధీనంలో పెట్టావు ఒక్క పలుకుతో....
పంచేంద్రియాలను సైతం నీవైపు తిప్పుకున్నావు ప్రేమతో...
ఎన్నో వ్యాధులను మాయం చేశావు నీ ఊదితో....
ఇంకెన్నో వెతలనే తొలగించావు నీ ఉనికితో....
ఇలా ఎన్నాళ్లైనా మా జీవితాలలో వెలుగులు నింపు సాయి నీ కాంతితో....
ఇంకెన్నాళ్ల వరకైనా మా జీవితాలకు రక్షగా ఉండు సాయి నీ కరుణతో....
ఓం శ్రీ సాయిరాం
🙏🙏🙏
-తేజ
No comments:
Post a Comment