షిరిడీ ప్రవేశము, షిరిడీ ప్రవేశము
బాబా కలిగించు నీ దివ్య దర్శనము
షిరిడీ ప్రవేశము, షిరిడీ ప్రవేశము
ఎందరో ఎదురుచూపుల సమ్మేళనము
ఇంకెందరో తపనల మిళితము
అందరికీ కలిగించు నీ దివ్య దర్శనము
షిరిడీ ప్రవేశము.....
ఎందరో వేదనల సంయుక్తము
ఇంకెందరో కోరికల సమ్ళిళితము
అందరికీ అందించు నీ కర స్పర్శనము
షిరిడీ ప్రవేశము.....
ఎందరో హృదయాల స్పందనము
ఇంకెందరో ఆర్తుల నినాదము
అందరికీ పంచి పెట్టు నీ ప్రేమామృతము
షిరిడీ ప్రవేశము.....
ఎందరో భక్తుల సంకల్పము
ఇంకెందరో బిడ్డల అభీష్టము
అందరికీ అందించు నీ దీవెనము
షిరిడీ ప్రవేశము.....
షిరిడీ ప్రవేశము, షిరిడీ ప్రవేశము
బాబా, కలిగించు నీ దివ్య దర్శనము
షిరిడీ ప్రవేశము, షిరిడీ ప్రవేశము
ఓం శ్రీ సాయిరాం
🙏🙏🙏
-తేజ
No comments:
Post a Comment