బాబా...
నీ నామమెంత తీయనిది
తలిచినంతనే కష్టము కరిగేను
వినిన వెంటనే నష్టము తొలగేను
నీ నామమెంత మహిమైనది
పలికినంతనే పాపము కరిగేను
పిలిచినంతనే భారము తొలగేను
నీ రూపమెంత చక్కనిది
చూసినంతనే బాధలు తొలగేను
తలచినంతనే వ్యధలు కరిగేను
నీ చరిత ఎంత గొప్పది
చదివినంతనే దుఃఖము తొలగేను
వినినంతనే సుఖము కలిగేను
నీ ప్రేమ ఎంత మధురమైనది
రుచి చూసిన వారికి ఎప్పటికీ మరపురానిది
చవిచూసిన వారికి ఎన్నటికీ తనివితీరనిది
ఓం శ్రీ సాయిరాం
🙏🙏🙏
-తేజ
No comments:
Post a Comment