సాయీ........
నువ్వే కానీ లేకుంటే.....?
నువ్వే కానీ అవతరించకుంటే.......?
ఆ ఊహే నన్ను హరిస్తోంది
ఆ ధ్యాసే నన్ను దహిస్తోంది
చుక్కాని లేని నావల్లే
చుక్కలే లేని నభమల్లే ఏమయ్యేను నా జీవితం
గమ్యం ఎరుగని పయనమల్లే
గాలిలో పెట్టిన దీపమల్లే ఏమయ్యేను నా జీవనం
పొత్తిళ్ళలో దాచుకొనే తల్లే లేకుంటే
వేలు పట్టి నడిపించే తండ్రే లేకుంటే... ఏమయ్యేను నా జీవితం
అనుక్షణం ప్రేమను పంచే నీవే లేకుంటే...
క్షణక్షణం రక్షించే నా బాబా లేకుంటే...ఏమయ్యేను నా జీవనం
నీవేకానీ లేకుంటే....?
నీవే కానీ మా కొరకు రాకుంటే...?
ఆ మాటకే కనులు కన్నీటి కొలనులౌతుంటే....
నువ్వు ఇప్పటికీ ఇంకా ఉన్నావన్న నీ ఉనికి ఒక్కటి చూస్తుంటే...
ఈ శ్వాస ఇంకా శ్వాసిస్తోంది
ఈ జీవి ఇంకా జీవిస్తోంది
నీ ప్రేమే నన్నిలా నడిపిస్తోంది
ఓం శ్రీ సాయిరాం
🙏🙏🙏
-తేజ
No comments:
Post a Comment