కరడుగట్టిన హృదిని శిల్పంగా మలిచేందుకు సాయినామమన్న ఉలి దొరికెనుగా
అజ్ఞానపు చీకట్లను చీల్చి జ్ఞాన జ్యోతులను వెలిగించేందుకు సాయిరాముడన్న మణి దొరికెనుగా
బరువెక్కిన గుండెల బాధ తీర్చేందుకు సాయిగానమన్న ఔషదము దొరికెనుగా
శ్రద్ధ, సబూరీల కలశలను నింపేందుకు సాయిలీలలన్న అమృతము మెండుగ ఉండెనుగా
భయమేల? చింతేల? ముందుకు నడిచేందుకు సాయి నామస్మరణతో ఈ జగమే వెలుగుతుండెనుగా
ఓం శ్రీ సాయిరాం
🙏🙏🙏
-తేజ
No comments:
Post a Comment