సాయీ!
నాతో నీకీ దాగుడుమూతలేల?
రెప్పపాటు కాలంలో మాయమైన
నీ కదలికలు నే చూడలేదునుకొంటివా?
నిన్నే తదేకంగా చూస్తున్న నా ఈ కన్నులకు తెలుసు ఓ రెప్పపాటు కదిలిన నీ నయనాల సంగతి... అది నాపై నీవు కురిపించే ప్రేమే అని
నిన్నే తనివితీరా చూస్తున్న నా ఈ కన్నులకు తెలుసు ఓ రెప్పపాటు కదిలిన నీ కరముల సంగతి... అది నాపై నీవు కురిపించే ఆశీర్వచనమే అని
నిన్నే ఆపాదమస్తకం చూస్తున్న నా ఈ కన్నులకు తెలుసు ఓ రెప్పపాటు కదిలిన నీ రూపం సంగతి... అది నాపై నీవు కురిపించే కరుణాల వర్షమే అని
"రెప్ప వేయకుండా నిన్నే గ్రోలుతున్న నా మనోనేత్రానికి తెలుసు నీతో నా బంధం అది ఎన్నో జన్మల పాటిదని"
ఓం శ్రీ సాయిరాం
🙏🙏🙏
-తేజ