సాయీ...సాయీ...సాయీ.... దయచూపుమోయీ....సాయీ...
శరణంటూ చేరితి నీ దివ్య చరణాలను
కరుణంటూ వేడితి నీ భవ్య నయనాలను సాయీ/
భిక్షంటూ వేడితి నీ కర కమలాలను
రక్షంటూ వేడితి నీ భుజ స్కంధాలను సాయీ/
వినమంటూ వేడితి నీ ఇరు శ్రవణాలను
ప్రేమంటూ చూచితి నీ చిరు అధరాలను సాయీ/
దీవెనంటూ కోరితి నీ స్మేర వదనానిని
సాయమంటూ వేడితి నీ ప్రియ హృదయానిని సాయీ/
ఓం శ్రీ సాయిరాం
🙏🙏🙏
-తేజ
No comments:
Post a Comment