Sunday, 31 May 2020

29 సాయి కరుణ


బాబా...


మా గుండెల్లో రగిలే వేదన చెప్తోంది మా
పాపముల భారమెంతో

నీ వాక్కుల అమృతము గ్రోలిన తరువాత తెలిసింది 
మా పూర్వపు పుణ్యమెంతో

మా అజ్ఞానపు చీకట్లు చూపుతున్నాయి 
మాా పూర్వపు దుస్థితి ఏమిటో

నీ పాదముల చెంత చేరిన మా ఈ స్థితి చూపుతోంది 
మా పూర్వపు భాగ్యమేమిటో

మా కష్టముల కడలి చెప్తోంది మేమెంత కాఠిన్యమో
నీ కారుణ్యపు నౌక చెపుతోంది నీవెంత కరుణమయుడివో

ఓం శ్రీ సాయిరాం 🙏🙏🙏

-తేజ

Tuesday, 26 May 2020

28 సాయి కల్పతరువు


బాబా...

చింతలను తీర్చే చింతామణులకే 
చింతామణివి నీవు

కోర్కెలను తీర్చే కామధేనువులకే 
కామధేనువువి నీవు 

తలచినది తీర్చే కల్పతరువులకే 
కల్పతరువువి నీవు

మా మది కోరకనే శ్రేయస్కరమైనది
మాకందించే శ్రేయోభిలాషివి నీవు

ఓం శ్రీ సాయిరాం 🙏🙏🙏

-తేజ

27 సాయి పలుకు



బాబా...

పిలిస్తే పలుకుతానన్నావు
తలిస్తే పక్కనే ఉంటానన్నావు
నీవైపు ఒక అడుగేస్తే, నావైపు పది అడుగులు వేస్తానన్నావు
నీ సమాధి నుండే నీవు మాట్లాడతానన్నావు

మరి నేను నిన్ను పిలిచేలా, తలిచేలా,
నీ వైపు నడిచేలా, నీతో మాట్లాడేలా
నా బుద్ధిని కూడా నీవే ప్రేరేపించు బాబా
ఓం శ్రీ సాయిరాం 🙏🙏🙏

-తేజ

26 సాయి శక్తి


బాబా...

అవ్యాజమైన నీ ప్రేమను 
ఎన్నిసార్లు రుచి చూసినా,

అపారమైన నీ కృపాధారలను 
ఎన్నిసార్లు చవిచూసినా, 

అద్భుతమైన నీ మహిమలను 
ఎన్నిసార్లు పొందినా,

అనిర్వచనీయమైన నీ ఉనికి ఘటనలను 
ఎన్నిసార్లు అనుభవించినా

తనివితీరక...
అనంతమైన నీ శక్తిధారలను మళ్లీ మళ్లీ
అభిలషించడమే మా నిరంతర ధ్యేయం

ఓం శ్రీ సాయిరాం 🙏🙏🙏

-తేజ

Monday, 25 May 2020

25 సాయి మహిమ


బాబా...

నీ చూపు, నీ రూపు, నీ తలపు
మము నడిపించేను నిత్యం

నీ కరుణ, నీ స్మరణ, నీ స్ఫురణ
మము రక్షించేను అనునిత్యం

నీ మమత, నీ చరిత, నీ మహిమ
మము దీవించేను ప్రతినిత్యం

నీ నామము, నీ అభయము, నీ చరణము,
మాకు చూపించేను మార్గం

ఇది జగమెరిగిన పరమ సత్యం

ఓం శ్రీ సాయిరాం 🙏🙏🙏

-తేజ

24 సాయి నామం


బాబా...
నా మదికే తెలియకుండా అప్రయత్నంగా
నా జిహ్వ నీ నామం ఉచ్ఛరిస్తుంటే...

నా జిహ్వ కదలకున్నా అప్రయత్నంగా
నా మది నీ నామం పలుకుతుంటే...

నిరంతరం నా తోడుగా ఉన్న
నిన్ను నేను చూస్తున్నా

నీ నీడలోనే ఉన్న నన్ను
నేను చూసుకుంటున్నా

ఓం శ్రీ సాయిరాం 🙏🙏🙏

-తేజ

23 సాయి సబూరి


బాబా...
నేనేల? ఈ కష్టజలధిని దాట లేకుంటిని
నీవేల? ఓ కరుణ నౌక నాకు పంపకుండా మిన్నకుంటివి

నేనేల? ఈ విషయవాంఛల గొడుగు తీయకుంటిని
నీవేల? నీ కరుణ వర్షంలో నన్ను తడపకుండా మిన్నకుంటివి

వేయేల? నేను నిన్నే నమ్మి బతుకుతుంటిని
నాకు దిగులేల? 
నేను నీ‌ పాదాలను గట్టిగా పట్టుకుని మిన్నకుంటిని

ఓం శ్రీ సాయిరాం 🙏🙏🙏

-తేజ

22 సాయి రావోయి

బాబా...

నా హృద్గది మందిరంలో నివసింప రావోయి

అహంకారమన్న మలినంతో నా హృద్గది నిండి పోయిందని వెళ్ళిపోకు సాయి
ఆ మలినాన్ని తుడిచే బాధ్యత నీదే నోయి

గర్వమన్న మట్టితో నా హృద్గది నిండి పోయిందని
వెళ్ళిపోకు సాయి
ఆ మట్టిని తొలగించే బాధ్యత నీదే నోయి

ద్వేషమన్న ధూళితో నా హృద్గది నిండి పోయిందని
వెళ్ళిపోకు సాయి
ఆ ధూళిని తుడిచే బాధ్యత నీదే నోయి

అసూయ అన్న దుమ్ముతో నా హృద్గది నిండి పోయిందని వెళ్ళిపోకు సాయి
ఆ దుమ్ముని తొలగించే బాధ్యత నీదే నోయి

బాధ అన్న భారంతో నా హృద్గది నిండి పోయిందని
వెళ్ళిపోకు సాయి
ఆ భారాన్ని నీ నిశ్వాసతో తొలగించే బాధ్యత నీదే నోయి

ఓం శ్రీ సాయిరాం 🙏🙏🙏

-తేజ

21 సాయి సత్యం


సాయి ఎంత నిజమో
సాయి శక్తి అంత నిజం

సాయి వాక్కు ఎంత నిజమో
సాయి కరుణ అంత నిజం

సాయి చరిత ఎంత నిజమో
సాయి మహిమ అంత నిజం

సాయి ఉనికి ఎంత నిజమో
సాయి ఆశీస్సులు అంత నిజం

సాయి ప్రేమ ఎంత నిజమో
ఆ ప్రేమలో మునిగి తేలుతున్న
మన మనసులంత నిజం

ఓం శ్రీ సాయిరాం 🙏🙏🙏

-తేజ

Saturday, 23 May 2020

20 సాయి సర్వం

బాబా....

జీవన రహదారిలో తప్పటడుగుల పసిపాపను నేనైతే, 
నా చేయి పట్టి నడిపిస్తున్న తండ్రివి నీవు

ఒడిదుడుకుల రక్కసిని చూసి భీతిల్లుతున్న పసిబిడ్డను నేనైతే, 
నను అక్కున చేర్చుకుని లాలిస్తున్న తల్లివి నీవు

జీవన గమ్యం చేరలేక చిన్నాభిన్నమై ఉన్నది నేనైతే,
మార్గదర్శకమై నను నడిపిస్తున్న గురువువి నీవు

కన్నీటి అగాధంలో దిక్కుతోచక దైన్యమై నిలిచింది నేనైతే, 
చేయూత నిచ్చి నను పైకి లాగుతున్న నేస్తం నీవు

నిన్నే మది నమ్మి సర్వశ్య శరణాగతి అంటున్నది నేనైతే, 
సర్వదా నను రక్షించి కాపాడుతున్న దైవం నీవు

ఓం శ్రీ సాయిరాం 🙏🙏🙏

-తేజ

101 సాయి నన్ను విడువకు

  సాయి... నేను పలకరించడం లేదని నువ్వు నాతో మాట్లాడటం మానేయకు సాయి...నా ప్రతి మాట మాటలో నీవే నిండి ఉండోయి  నేను నిన్ను తలవడం లేదని నువ్వు నన్...