Monday, 17 August 2020

55 సాయి ఊది

 


శ్రీ సాయినాధా రమ్ము రమ్ము

కళ్యాణ రామా రమ్ము రమ్ము 

సంచుల నిండా ఊదిని తే తెమ్ము


శ్రీసాయినాధా రమ్ము రమ్ము

కారుణ్య థామా రమ్ము రమ్ము

దోసిళ్ళ నిండా ఊదిని తే తెమ్ము


శ్రీ సాయినాధా రమ్ము రమ్ము

నీ ప్రేమను పంచంగ వేగిరమే రమ్ము

నీ బిడ్డలనెల్లరిని కాపాడ రా రమ్ము


శ్రీ సాయినాధా రమ్ము రమ్ము

నీ ఊదిని మా నుదుట తీర్చిదిద్దంగ రమ్ము

నీ ఊది తోటి వ్యాధిని పారద్రోల రా రమ్ము


శ్రీ సాయినాధా రమ్ము రమ్ము

మా అజ్ఞాన తిమిరమును తొలగింప రమ్ము

జ్ఞాన జ్యోతులను వెలిగింప రా రమ్ము


శ్రీ సాయినాధా రమ్ము రమ్ము

సర్వ జీవులను రక్షింప రమ్ము రమ్ము

సకల జగములనేలంగ రా రమ్ము


శ్రీసాయినాధా రమ్ము రమ్ము

కారుణ్య థామా రమ్ము రమ్ము

దోసిళ్ళ నిండా ఊదిని తే తెమ్ము


ఓం శ్రీ సాయిరాం

🙏🙏🙏


-తేజ

Saturday, 15 August 2020

54 సాయి ఆపన్నహస్తం


విడువము విడువము ఆ చేయిని

అడుగడుగున ఆదుకునే శ్రీ సాయిని

విడువము విడువము ఆ చేయిని

అండదండగ నిలిచే శ్రీ సాయిని


అన్నార్తులకు వండి వడ్డించిన చేయిని

దీనార్తులను దరి చేర్చుకున్న చేయిని

విడువము విడువము ఆ చేయిని


పశుపక్షులను ప్రేమతో లాలించిన చేయిని

పసిబిడ్డను మంటల నుండి తీసిన చేయిని

విడువము విడువము ఆ చేయిని


బీదసాదలను ఆదుకున్న చేయిని

బాధలనెల్ల ఇట్టే తొలగించే చేయిని

విడువము విడువము ఆ చేయిని


ఊదిని నుదుటన దిద్దిన చేయిని

వ్యాధులను మాయం చేసిన చేయిని

విడువము విడువము ఆ చేయిని


భక్తుల శిరముపై నిలిచిన చేయిని

దిక్కులను సైతం శాసించిన చేయిని

విడువము విడువము ఆ చేయిని


పంచభూతాలను అదుపు చేసిన చేయిని

పంచేంద్రియిలను వశ పరుచుకున్న చేయిని

విడువము విడువము ఆ చేయిని


విడువము విడువము ఆ చేయిని

అడుగడుగున ఆదుకునే శ్రీ సాయిని

విడువము విడువము నీ చేయిని

అండదండగ నిలిచే శ్రీ సాయిని


ఓం శ్రీ సాయిరాం

🙏🙏🙏


-తేజ


Friday, 14 August 2020

53 సాయి అపార కరుణ


బాబా...

ఎంతటి ఎంతటి కర్మము మాది 

అది ఎంతదైనా, దాన్ని తొలగించే నీ అపార ప్రేమ ముందు

అది చాలా చిన్నది


ఎంతటి ఎంతటి కష్టము మాది 

అది ఎంతదైనా, దాన్ని తీసేసే నీ అపార కరుణ ముందు 

అది చాలా చిన్నది


ఎంతటి ఎంతటి ఆవేదన మాది

అది ఎంతదైనా, దయ చూపే నీ హృది ముందు 

అది చాలా చిన్నది


ఎంతటి ఎంతటి గర్వము మాది 

అది ఎంతదైనా, దాన్ని అణిచేటి నీ అపార ఘనత ముందు

అది చాలా చిన్నది


ఎంతటి ఎంతటి కామ్యము మాది

అది ఎంతదైనా, దాన్ని ఈడేర్చే నీ అపార మహిమ ముందు

అది చాలా చిన్నది


ఎంతటి ఎంతటి దూరము నీకు మాకు మధ్య

అది ఎంతదైనా, నీ పట్ల మాలోని అపార భక్తి విశ్వాసములకు ఔతుంది అది చాలా చాలా చిన్నది


ఓం శ్రీ సాయిరాం

🙏🙏🙏


-తేజ




Wednesday, 12 August 2020

52 సాయి పంకజం



తలచితిని తలచితిని ఓ సాయీ 

తలచితిని నిన్నే నోయి 

తలచినంతనే ఓ సాయీ 

నా మది పులకరించెనోయి


ఉదయించే సూర్యుని లో ఓ సాయీ 

నీ తేజమును నే కంటినోయి

పున్నమీ చంద్రునిలో ఓ సాయీ

నీ రూపమును నే కంటినోయి


విరిసిన కుసుమమును చూసి ఓ సాయీ

పొంగేటి నీ ప్రేమను నే కంటినోయి

వెలిగేటి దివ్వెని చూసి ఓ సాయీ

కరుణించే నీ మనసుని నే కంటినోయి


వెన్నపూస ను చూసి ఓ సాయీ

నీ మెత్తాని మనసుని నే కంటినోయి

వెన్నెల ను చూసి ఓ సాయీ

నీ చల్లాని చూపుని నే కంటినోయి


పంకము ను చూసి ఓ సాయీ

నా మనసుని నే కంటినోయి

పంకమున విరిసిన పంకజమును చూసి ఓ సాయీ

నా మనసున సైతం నిలిచిన నిన్ను నే కంటినోయి


పద్మములను చూసి ఓ సాయీ

నీ పాద ద్వయమును నే కంటినోయి

భ్రమరముగా మార్చు నన్ను ఓ సాయీ

నీ పాద పద్మములను విడువక నే చుట్టెదనోయి


తలచితిని తలచితిని ఓ సాయీ 

తలచితిని నిన్నే నోయి 

తలచినంతనే ఓ సాయీ 

నా మది పులకరించెనోయి


ఓం శ్రీ సాయిరాం

🙏🙏🙏


-తేజ

Tuesday, 11 August 2020

51 సాయి దివ్య దర్శనం



ఎన్నాళ్లకెన్నాళ్లకెన్నాళ్ళకు కలిగింది

కరుణామయుని ఈ దివ్యదర్శనం


ఇన్నాళ్లు, అన్నాళ్ళు అని ఎన్నాళ్లనుంచో 

వేచి చూసిన ఫలం ఈ దివ్యదర్శనం


ఎన్నెన్ని నా కన్నీళ్లనన్నింటిని 

ఇలా పన్నీరు చేసింది ఈ దివ్యదర్శనం


ఇన్నేళ్ల నా జీవితాన్ని ఇన్నాళ్లకు

ధన్యమును చేసింది ఈ దివ్య దర్శనం


ఎన్నెన్ని నా జన్మాల పుణ్యకర్మ ఫలమో

జన్మరాహిత్యాన్ని ఇచ్చేటి ఈ దివ్యదర్శనం


ఎన్నాళ్ళకెన్నాళ్ళకెన్నాళ్ళకైనా, మరి ఇంకెన్నాళ్లకైనా

మరువలేను ఈనాటి ఈ దివ్యదర్శనం


ఓం శ్రీ సాయిరాం

🙏🙏🙏


-తేజ

Monday, 10 August 2020

50 సాయీ రావయ్య

బాబా...

మా వేదనలో ఆవేదనని,

మా ఆవేదనలో వేదనని తొలగించ వేగిరమే రావయ్య


మా కష్టములలో కన్నీటిని, 

మా కన్నీటిని తెచ్చిన కష్టాలని తొలగించ వేగిరమే రావయ్య


మా ఆపదలలో బాధని,

మా బాధలకు కారణమైన ఆపదలని తొలగించ వేగిరమే రావయ్య


మా జన్మ జన్మల కర్మలను,

మా కర్మలు తెచ్చే ఈ జన్మజన్మలను తొలగించ వేగిరమే రావయ్య


చిత్రమైన మహమ్మారిని చూసి, చిగురుటాకులా వణుకుతున్న 

మమ్ము చేతలొడ్డి రక్షించ వేగిరమే రావయ్య 


ఓం శ్రీ సాయిరాం

🙏🙏🙏


-తేజ

49 సాయి పంచపూజ

 

సాయికి గంధము చేద్దాము

సాయి నుదుటిన పెడదాము

ప్రేమను మనసు నుండి తీద్దాము

భక్తిని దానికి రంగరిద్దాము

సాయికి గంధము చేద్దాము

సాయి నుదుటిన పెడదాము


సాయికి మాలను చేద్దాము

సాయి మెడలో వేద్దాము

కొన్ని ప్రేమ‌పూలను తెద్దాము

భక్తి దారమునకు విశ్వాసముగ చుడదాము

సాయికి మాలను చేద్దాము

సాయి మెడలో వేద్దాము


సాయికి వస్త్రము చేద్దాము

సాయి ఒడలికి చుడదాము

భక్తి దారమును తెద్దాము

ప్రేమ మగ్గముకు కడదాము

సాయికి వస్త్రము చేద్దాము

సాయి ఒడలికి చుడదాము


సాయికి ధూపమును చేద్దాము

సాయి ముందర వేద్దాము

ప్రేమ సాంబ్రాణి తెద్దాము 

భక్తి నిప్పుకి జోడిద్దాము

సాయికి ధూపమును చేద్దాము

సాయి ముందర వేద్దాము


సాయి జ్యోతిని వెలిగిద్దాము

సాయి ముందర పెడదాము

ప్రేమ ఒత్తిని చేద్దాము 

భక్తి నూనెను పోద్దాము

సాయి జ్యోతిని వెలిగిద్దాము

సాయి ముందర పెడదాము


సాయికి నివేదన చేద్దాము

సాయికి గోరుముద్దలు పెడదాము

భక్తి, ప్రేమలను కలుపుదాము

వాటితో స్వచ్ఛ మనసనే కిచిడీ చేద్దాము

సాయికి నివేదన చేద్దాము

సాయికి గోరుముద్దలు పెడదాము


సాయి పంచపూజను చేద్దాము

సాయి సేవ‌ను చేద్దాము

సాయి సేవను చేద్దాము


ఓం శ్రీ సాయిరాం

🙏🙏🙏


-తేజ

48 సాయి లీలలు

 

సాయి సాయి అని పిలవండి 

సాయి నామము పలకండి 

మదిలో సాయిని నిలపండి 

రూపము ధ్యానము చేయండి


పిలిచిన పలికే దైవమని భక్తితో నమ్మండి

తలిచిన వెంటనే వెన్నంటే నిలిచేను చూడండి

సాయి సాయి అని పిలవండి 

సాయి నామము పలకండి 


కష్ట సుఖములలో మరువక తలవండి

మరుక్షణమే సద్గురు లీలలు చూడండి

సాయి సాయి అని పిలవండి 

సాయి నామము పలకండి 


పశు పక్షులను ప్రేమగా చూడండి

వెనువెంటనే ప్రేమను కురిపించే సాయిని కనరండి

సాయి సాయి అని పిలవండి 

సాయి నామము పలకండి 


ఆర్తులను, నిరుపేదలను ఆదరించండి

అనునిత్యము సాయి మీకు అండగ నిలిచేను చూడండి

సాయి సాయి అని పిలవండి 

సాయి నామము పలకండి


చిత్తముతో సాయి చరితమును చదవండి

చిత్రముగా సాయి చేసే లీలలు కనరండి

సాయి సాయి అని పిలవండి 

సాయి నామము పలకండి


వదలక సాయి ఊదిని ధరియించండి

వ్యాధులు వడిగా మాయమయ్యేను చూడండి

సాయి సాయి అని పిలవండి 

సాయి నామము పలకండి


శ్రద్ధ, సబూరి తో సాయి పాదములు కొలవండి

కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువు సాయి నమ్మండి

సాయి సాయి అని పిలవండి 

సాయి నామము పలకండి


ప్రేమతో, ఆర్తితో సాయికి హారతులీరండి

సమర్థ సద్గురుని దీవెనలను పొందండి

సాయి సాయి అని పిలవండి 

సాయి నామము పలకండి


సాయి సాయి అని పిలవండి 

సాయి నామము పలకండి 

మదిలో సాయిని నిలపండి 

రూపము ధ్యానము చేయండి


ఓం శ్రీ సాయిరాం

🙏🙏🙏


-తేజ

Saturday, 8 August 2020

47 సాయి అనుభూతి

బాబా...

చూశా నిన్ను మళ్ళీ ఈ రోజు నా దగ్గరగా

కలిశా నిన్ను మళ్ళీ ఈ రోజు కొత్తగా


చూశా నిన్ను మళ్ళీ ఈ రోజు ఒకరి మాటలో

కలిశా నిన్ను మళ్ళీ ఈ రోజు ఇంకొకరి పాటలో


చూసా నిన్ను మళ్ళీ ఈ రోజు ఒకరి అనుభవంలో

కలిసా నిన్ను మళ్ళీ ఈ రోజు ఇంకొకరి అనుభూతిలో


ఒకరి మాటలో, ఇంకొకరి పాటలో... మళ్ళీ చూశా

ఒకరి అనుభవంలో, ఇంకొకరి అనుభూతిలో... మళ్లీ కలిశా


మా అందరి ఎదలో నమ్మకం అన్న పీఠం పై ఠీవీగా కూర్చున్న

నిన్ను మళ్ళీ కలిశా,

పాతైనా మళ్ళీ మళ్ళీ సరికొత్తగా


ఓం శ్రీ సాయిరాం

🙏🙏🙏


-తేజ

46 సాయి సన్నిధి

బాబా...

సదా మా కరములు చేయాలి నీకు వందనము

సదా మా శిరముపై ఉండాలి నీ కర స్పర్శనము


సదా మా ఇంట ఉండాలి నీ పాద స్పర్శనము

సదా మా మనసున నిలవాలి నీ రూప దర్శనము


సదా మా పెదవులపై నిలవాలి నీ నామ సంకీర్తనము

సదా మా పదములు అనుసరించాలి నీ దివ్య మార్గము


సదా మా వెన్నంటే నిలవాలి నీ చల్లని దీవెనము

సదా నీ కన్నులు కురిపించాలి కరుణ వర్షము


ఓం శ్రీ సాయిరాం

🙏🙏🙏


-తేజ

45 సాయి కొలువు

ఓ సాయీ, ఓ సాయీ

ఓ సాయీ నీ రాకతో 

షిరిడీ పురమాయే పుణ్యక్షేత్రము 2

ఓ సాయీ నీ అడుగుతో 

మసీదు ఆయే ద్వారకము 2


సాయీ నీ కరుణతో 

ఈ భవ జలధినే దాటింపుము

సాయీ నీ ప్రేమతో

ఈతి బాధలనే తొలగింపుము


సాయీ నీ కాంతితో 

మము ముందుకు నడిపింపుము

సాయీ నీ దీవెనతో

మము ఎల్లవేళలా రక్షింపుము


సాయీ నీ సన్నిధిలో 

మా జీవితమాయే నందనవనమ

సాయీ నీ సమాధితో

లెండీ వనమాయే బృందావనము


సాయి నీ రాకతో

షిరిడీ పురమాయే పుణ్యక్షేత్రము

సాయీ నీ కొలువుతో

మా మనసాయే మందిరము

మా మనసాయే మందిరము


ఓం శ్రీ సాయిరాం

🙏🙏🙏


-తేజ

44 సాయి కాంతి

బాబా...

మసీదులో వెలిగించావు దీపజ్యోతులను నీటితో...

మాలో వెలిగించావు జ్ఞానజ్యోతులను నీ మాటతో...


రాతి నుండి నీటినే పుట్టించావు నీ సటకా దెబ్బతో...

రాతి మనసులలో కరుణనే పుట్టించావు నీ దివ్య బోధతో...


ఉప్పునీటిని సైతం శుద్ధ జలముగ మార్చావు కొన్ని పూలతో...

ఉప్పని మా కన్నీటిని ఆనందభాష్పాలుగా మార్చావు నీ పిలుపుతో....


పంచభూతాలనే ఆధీనంలో పెట్టావు ఒక్క పలుకుతో....

పంచేంద్రియాలను సైతం నీవైపు తిప్పుకున్నావు ప్రేమతో...


ఎన్నో వ్యాధులను మాయం చేశావు నీ ఊదితో....

ఇంకెన్నో వెతలనే తొలగించావు నీ ఉనికితో....


ఇలా ఎన్నాళ్లైనా మా జీవితాలలో వెలుగులు నింపు సాయి నీ కాంతితో....

ఇంకెన్నాళ్ల వరకైనా మా జీవితాలకు రక్షగా ఉండు సాయి నీ కరుణతో....


ఓం శ్రీ సాయిరాం

🙏🙏🙏


-తేజ

101 సాయి నన్ను విడువకు

  సాయి... నేను పలకరించడం లేదని నువ్వు నాతో మాట్లాడటం మానేయకు సాయి...నా ప్రతి మాట మాటలో నీవే నిండి ఉండోయి  నేను నిన్ను తలవడం లేదని నువ్వు నన్...