Saturday, 23 May 2020

5 సాయి ప్రణతి

బాబా...
నాపై కురిసే నీ చల్లనిచూపుల
నయనమ్ములకు నా ప్రణతి

నా మొర ఆలకించే
నీ కర్ణమ్ములకు నా ప్రణతి

నా జీవన గతినే మార్చిన వాక్కులిడిన
నీ అధరమ్ములకు నా ప్రణతి

నా పాపపు భారాలు మోసే
నీ భుజస్కంధములకు నా ప్రణతి

నా శిరస్సు  పై ఎల్లప్పుడూ స్థిరంగా ఉండే
నీ కరములకు నా ప్రణతి

నా శిరస్సుకు ఎల్లప్పుడూ స్దావరమైన
నీ పదకమలమ్ములకు నా ప్రణతి

నా హృదయ గుహలో బంధీవైన నిలువెత్తు 
నీ రూపమునకు నా ప్రణతి

సర్వస్యశరణాగతి

ఓం శ్రీ సాయిరాం 🙏🙏🙏

-తేజ

4 సాయి వందనం

బాబా...
జాగృదావస్తలో ఉన్న ప్రతిజీవిలోని చైతన్యశక్తివి నీవే
నిద్రాణస్థితిలో ఉన్న ప్రతి వస్తువులోని చైతన్య శక్తివీ నీవే 
నీలోని ఆ చైతన్య శక్తికి నా వందనం

విశ్వమంతా నిండిన నీ హృదయంలో
కరుణతో  నన్ను ఉండనిచ్చావు
పిడికెడైనా లేని నా హృదయంలో నిన్ను బంధించినా
కరుణతో  నీవున్నావు
నీలోని ఆ కారుణ్యానికి నా వందనం 

నీకు నాకు మధ్య ఉన్న దుర్గుణాల గోడను కూల్చమన్నావు
నన్ను నీ దరి కి చేర్చే సుగుణాల మేడను కట్టమన్నావు
గుణాతీతుడవైన నీకు నా వందనం 

నీపై ఓరిమితో నమ్మకం ఉంచమన్నావు
మార్గము నీవై భవసాగరాలనే దాటిస్తానన్నావు
మార్గదర్శకుడవైన నీకు నా వందనం

నీ నామ స్మరణమే పాపహరణం అన్నావు
నీ పాదకమలాల మధువుని భ్రమరమై అందుకోమన్నావు
దయామూర్తివైన నీకు నా వందనం 

నీ రూపాన్ని సదా నా హృదయంలో నిలుపమన్నావు
ప్రేమతో నన్ను నీ దరి చేర్చుకున్నావు
ప్రేమైకమూర్తివైన నీకు నా  పాదాభివందనం

ఓం శ్రీ సాయిరాం🙏🙏🙏

-తేజ

3 సాయి సర్వస్వము


బాబా...

నను లాలించే తల్లివి నీవే 
నను పాలించే తండ్రివి నీవే 

నా వెన్నుగ నిలిచే బంధువు నీవే 
నాతో నడిచే సఖుడవు నీవే 

నాలోన ఉన్న కాసింత జ్ఞానానివీ నీవే 
నాకున్న ధనాగారానివీ నీవే 

నను నడిపించే గురువువు నీవే 
నను నిత్యం రక్షించే దైవం నీవే 

నా ఆత్మలోని అంతరాత్మవి నీవే

ఓం శ్రీ సాయిరాం 🙏🙏🙏

-తేజ

2 సాయి ప్రార్ధన


బాబా...

మా దేహమే ఒక నింబ వృక్షంగా
మా మనసే నీ కోవెల గా మారాలి 

మా మనోనేత్రం నిరంతరం నీ దర్శనం చేయాలి 
మా విశ్వాసమే నీ ముందు దీపం గా వెలగాలి

మా గుండె సవ్వడి నీ నామ స్మరణము కావాలి
మా ఉఛ్వాసని‍‍శ్వాసలు నీ తలంపుగా సాగాలి

మా పలుకులే నీకు నైవేద్యం కావాలి
మా ప్రేమే నీకు ఆహార్యం అవ్వాలి

నీ భుక్తశేషమే మా ఆహారం కావాలి 
నీ లీలామృతమే మా దాహం తీర్చాలి

మాలోని అరిషడ్వర్గాలు కుసుమాలై 
నీ దివ్యపాదాల చెంత చేరాలి 

ఓం శ్రీ సాయిరాం 🙏🙏🙏

-తేజ

1 సాయి తొలి దర్శనం

బాబా...

తొలిసారి నిన్ను దర్శించినపుడు
నే పొందిన ఆనందం వర్ణనాతీతం 

కనులారా నీ కన్నుల కాంతి కాంచినపుడు
నే పొందాను తన్మయత్వం 

తనివితీరా నీ చరితామృతం గ్రోలాక
తెలిసింది నీ దివ్యత్వం

నోరారా నీ నామజపం చేశాక
తెలిసింది అమృతత్వం

ప్రియమారా నీ వాక్కులప్రేమ గ్రోలాక
పొందాను ఆనందపారవశ్యం

మనసారా నీ పాదదర్శనం చేశాాక
తెలిసింది నా శాంతిథామం

ఓం శ్రీ సాయిరాం🙏🙏🙏

-తేజ

101 సాయి నన్ను విడువకు

  సాయి... నేను పలకరించడం లేదని నువ్వు నాతో మాట్లాడటం మానేయకు సాయి...నా ప్రతి మాట మాటలో నీవే నిండి ఉండోయి  నేను నిన్ను తలవడం లేదని నువ్వు నన్...