Thursday, 6 August 2020
43 సాయి సందర్శనం
Monday, 3 August 2020
42 సాయి మధురం
నీ నామమెంత తీయనిది
తలిచినంతనే కష్టము కరిగేను
వినిన వెంటనే నష్టము తొలగేను
నీ నామమెంత మహిమైనది
పలికినంతనే పాపము కరిగేను
పిలిచినంతనే భారము తొలగేను
నీ రూపమెంత చక్కనిది
చూసినంతనే బాధలు తొలగేను
తలచినంతనే వ్యధలు కరిగేను
నీ చరిత ఎంత గొప్పది
చదివినంతనే దుఃఖము తొలగేను
వినినంతనే సుఖము కలిగేను
నీ ప్రేమ ఎంత మధురమైనది
రుచి చూసిన వారికి ఎప్పటికీ మరపురానిది
చవిచూసిన వారికి ఎన్నటికీ తనివితీరనిది
ఓం శ్రీ సాయిరాం
🙏🙏🙏
-తేజ
Saturday, 25 July 2020
41 సాయి భజన
సాయి నామమే సదా మననము
ఆతని దివ్య రూపమే బహు మధురము
సాయి స్మరణమే సర్వపాపహరణము
ఆతని ప్రేమ వాక్కులే ముక్తి మార్గము
సాయి లీలలే దీపకాంతులు
ఆతని అభయహస్తమే భక్తులకి మనోధైర్యము
సాయి భజనలే మనోరధ దాయకం
ఆతని చల్లని చూపులే మహానంద భరితం
సాయి గానమే మహా పుణ్య ఫలం
ఆతని దరహాసమే జగద్రక్షణం
సాయి దర్శనం అది దివ్య దర్శనం
ఆతని చరణారవిందమే సదా పూజనీయం
ఓం శ్రీ సాయిరాం
🙏🙏🙏
-తేజ
40 సాయి వెన్నెల
బాబా…
వెన్నెలంటి నీ చూపును మాపై కురిపించు
సాయీ….వెన్న వంటి నీ మనసుని మాపై కరిగించు
అమ్మ వంటి నీ ప్రేమను మాపై చూపించు
సాయీ….అమృతము వంటి నీ దీవెన మాపై కురిపించు
దీపమల్లే మా దారిలో వెలుగును చూపించు
సాయీ….మంచు వంటి నీ మనసుతో మాపై క్షమనే కురిపించు
మేఘమల్లె నీ కరుణను మాపై వర్షించు
సాయీ….మాయ వడిలో చిక్కుకున్న మమ్ము సదా రక్షించు
ఓం శ్రీ సాయిరాం
🙏🙏🙏
-తేజ
Sunday, 19 July 2020
39 సాయి తేజస్సు
38 సాయి సర్వాంతర్యామి
ఉండీ లేనట్టి సర్వమూ నీవే
Thursday, 16 July 2020
37 సాయి నివేదన
Tuesday, 14 July 2020
36 సాయి పాదము
Monday, 13 July 2020
35 సాయి తలపు
Wednesday, 24 June 2020
101 సాయి నన్ను విడువకు
సాయి... నేను పలకరించడం లేదని నువ్వు నాతో మాట్లాడటం మానేయకు సాయి...నా ప్రతి మాట మాటలో నీవే నిండి ఉండోయి నేను నిన్ను తలవడం లేదని నువ్వు నన్...
-
సాయి... నేను పలకరించడం లేదని నువ్వు నాతో మాట్లాడటం మానేయకు సాయి...నా ప్రతి మాట మాటలో నీవే నిండి ఉండోయి నేను నిన్ను తలవడం లేదని నువ్వు నన్...
-
సాయి... నిన్నే తలచిన ప్రతిసారి కదిలేను మా దేహరథం నీకు దగ్గరగా వెడలేను మా మనోరథం దుర్గుణములకు దూరంగా నీ నామము పలికిన ప్రతిసారి చేరనీ మమ్ము ...
-
సాయీ నే చేరితి నీ పాదకమలము....అది మధువులొలుకు దివ్యకమలము సాయీ నే చేరితి నీ పాదకమలము...ఎన్నటికీ తీరనిది నా భ్రమర తృష్ణము సాయీ నీ పాద కమలము ...









