Saturday, 23 May 2020

15 సాయి అనుబంధం

బాబా...
నా అజ్ఞానపు చీకట్లు చూపుతున్నాయి
నా పూర్వపు దుస్థితి ఏదో ఉందని
నీ పాదముల చెంత చేరిన నా ఈ స్థితి చూపుతోంది
నా పూర్వపు భాగ్యం కూడా ఏదో ఉందని

నా హృద్గదిలో కలిగే అలజడి చెప్తోంది
నా పూర్వకర్మల భారమెంతో ఉందని
నీ చరితామృతం గ్రోలిన తర్వాత తెలిసింది
నా పూర్వపు పుణ్యం కూడా ఎంతో ఉందని

నా దారిలో ఎదురయ్యే సంకట కంటకాల గని చెప్తోంది
నా పూర్వపు కాఠిన్యమేదో ఉందని
నీ కారుణ్యపు నౌకను ఎక్కాక తెలిసింది
నా పూర్వపు మంచితనం కూడా ఏదో ఉందని

నీ దీవెనలే రక్షణ కవచాలై నాకు చెప్తున్నాయి
నా వెన్నంటే నువ్వున్నావని,
నన్ను నడిపిస్తున్నావని....
నీవెంతో కరుణామయుడవని

ఓం శ్రీ సాయిరాం 🙏🙏🙏

-తేజ

14 సాయి లోకం

బాబా...

తలచినదే తడవుగా కనిపించేవు
మది పిలిచినదే తడవుగా అగుపించేవు

ఏ చోట నేనున్నా తలచిన వెంటనే చిత్రంగా
కనిపించేను నీ చిత్రం
ఏ ధ్యాసలో నేనున్నా మైమరపు కమ్మిన వెంటనే
చూపించేవు నీ అస్తిత్వం

ఎప్పుడు నే ధ్యానం చేద్దామని కూర్చున్నా,
రెప్ప మూసిన వెంటనే కనిపించేను నీ రూపం
ఎప్పుడు నా దేహం కష్టానికి గురి కాబోతున్నా, పెదవులు వెంటనే పలికేను నీ నామం

ఏ సంతోషంతో నేను పులకరిస్తున్నా, 
ఎదలో పరుగాపక జరిగేను నీ స్మరణం
ఏ వ్యధ నన్ను పలకరిస్తున్నా, 
ఎద లోతుల్లో నేనున్నానంటూ వినిపించేను నీ స్వరం

ఎప్పుడు,ఎక్కడ, ఏ స్థితిలో నేనున్నా,
ఎన్నడూ నా వెంటే ఉండి నన్ను రక్షిస్తున్న నా సాయీ
నీకివే నా కృతజ్ఞతాభివందనాలు

ఓం శ్రీ సాయిరాం 🙏🙏🙏

-తేజ

13 సాయి ఆశీస్సులు


బాబా...
ఎందరికో అభయాన్నిచ్చు నీ కరములు
నా శిరస్సును నిమిరేదెన్నడు?

ఎందరినో పసిబిడ్డలను చేసి లాలించే నీ ఒడిలో
నే నిదురించేదెన్నడు?

ఎందరికో శాంతిథామమైన నీ పాదాల చెంత 
నాకు చోటిస్తావెన్నడు?

ఎందరికో జీవన్ముక్తిని ప్రసాదించు నీవు
నన్ను నీ దరి చేర్చుకొనేదెన్నడు?

ఓం శ్రీ సాయిరాం 🙏🙏🙏

-తేజ

12 సాయి వీక్షణం

బాబా...
నా మోమున ఇంకా 
ఓ చిరు ధరహాసం ఉన్నదంటే 
అది నీపై నాకున్న చెరగని విశ్వాసంతో
నా మనసున ఇంకా ఓ ప్రశాంతత ఉన్నదంటే 
అది నాపై నీకున్న కరుణా వీక్షణంతో

నా మాటలో‌ ఇంకా ధైర్యం ఉన్నదంటే 
అది నీపై నాకున్న చెరగని విశ్వాసంతో
నా బాటలో ఇంకా ఓ‌ అడుగు‌ వేస్తున్నానంటే 
అది నాపై నీకున్న కరుణా వీక్షణంతో

నా ఆశలకింకా శ్వాస ఉన్నదంటే అది 
నీపై నాకున్న చెరగని విశ్వాసంతో
నా శ్వాసలకింకా ఆయుష్షు ఉన్నదంటే 
అది నాపై నీకున్న కరుణా వీక్షణంతో

నా ఈ జీవిత సమరంలో 
విజయాన్ని వరించాలంటే 
నేను నీపై కురిపించాలి  చెరగని విశ్వాసం
నీవు నాపై కురిపించాలి కరుణా‌ల వర్షం

ఓం శ్రీ సాయిరాం 🙏🙏🙏
తేజ

11 సాయి ఉనికి


బాబా...

నువ్వున్నావన్న నమ్మకంతో నేను చేరాను నీ దరికి
నేనున్నాని నువ్వు చూపిస్తున్నావు ప్రతి క్షణం నీ ఉనికి

నువ్వున్నావన్న  నమ్మకంతో నడిపిస్తున్నాను ఈ దేహరధాన్ని
నేనున్నాని నువ్వు  అందిస్తున్నావు ప్రతి క్షణం నీ దీవెనలవరాన్ని

నువ్వున్నావన్న నమ్మకంతో నా శిరమును వాల్చాను నీ పాదాలపై
నేనున్నాని నువ్వు మోస్తున్నావు నా భారాలను నీ భుజాలపై

నువ్వున్నావన్న నమ్మకంతో జీవిస్తున్నాను నీపై ఒరిగి ఒరిగి
నేనున్నాని నువ్వు  అందిస్తున్నావు నీ ప్రేమను కొసరి కొసరి

ఓం శ్రీ సాయిరాం 🙏🙏🙏

-తేజ

10 సాయి శతవర్ధంతి


ప్రేమ నిండిన నీలికన్నుల శ్రీసాయికి 
శతవర్షాల వర్ధంతులు

కరుణ నిండిన లోతుగుండెల శ్రీసాయికి 
శతకోటి వందనాలు

దయ నిండిన వరాలకరాల శ్రీసాయికి 
శతకోటి హారతులు

అమృతం నిండిన అమ్మవంటి శ్రీసాయికి 
శతకోటి దక్షిణ తాంబూలాలు

మరి కాఠిన్యం నిండిన రాయివంటి మాకు
అందించవా శ్రీసాయీ....నీ శతసహస్రకోటి దీవెనలు

ఓం శ్రీ సాయిరాం 🙏🙏🙏

-తేజ

9 సాయి విన్నపము

బాబా...
ఉందో లేదో తెలియని మరుజన్మల ఊసు నాకొద్దు
ఉందని తెలుస్తున్న ఈ జన్మను మాత్రం నాచే వృధా పోనీవద్దు

బాబా...
ఉండీ లేనట్టి ఊరేగే జీవితం నాకొద్దు
ఉన్నది ఎన్నాళ్లైనా నలుగురికి ఊరటనిచ్చే శక్తి నాకిద్దూ

బాబా...
ఉరుకుల పరుగుల విషయ వాంఛలు నాకొద్దు
ఉరకలేస్తున్న మనసుకి నువ్వేకావా సరిహద్దు

బాబా...
ఉచ్ఛ్వాసనిశ్వాసల గణితాలు నాకు అసలే వద్దు
ఉచ్ఛ్వసించిన ప్రతిసారీ నీ నామం ఉఛ్ఛరించేలా నన్ను ఉద్దరిద్దూ

అందుకే నీకు నచ్చే రీతిగా నన్ను సరిదిద్దు 
పనికొచ్చే రీతిగా నా ఈ జన్మను తీర్చిదిద్దు

ఓం శ్రీ సాయిరాం
🙏🙏🙏

-తేజ

8 సాయి కారుణ్యం

బాబా...

దిక్కు తోచని స్థితిలో ఉన్న మాకు
దారి చూపించు సాయి

దయనీయ స్థితిలో ఉన్న మాయందు
దయ చూపించు సాయి

అగాధపు అంచులో ఉన్న
మమ్ము ఆదరించు సాయి 

పొంచి ఉన్న కష్టాలను
నీ కరుణతో కాల్చివేయు సాయి 

వేదనతో సతమతమవుతున్న
మమ్ము వేగిరమే వచ్చి కాపాడు సాయి 

కారుణ్యముతో నీ కారుణ్యమును వొసన్గు సాయి

ఓం శ్రీ సాయిరాం 🙏🙏🙏

-తేజ

7 సాయి ప్రవల్లిక

బాబా...

ఎన్నాళ్లని ఈ దిక్కు తోచని జీవన ప్రస్థానం
ఇంకెన్నాళ్లని ఈ అంతు చిక్కని జన్మల ప్రస్థానం

ఎప్పుడు ఆగేను ఈ భయాందోళనల ప్రవాహం 
ఇంకెప్పుడు సాగేను నీవైపు నా ఆలోచనల ప్రవాహం

ఎందుకు  పనికి వచ్చేను ఈ విషయవాంఛల ప్రమోదం
ఇంకెందుకు ఈ జీవనం తెలియనపుడు అసలైన ప్రమోదం

ఎలా దాటగలను నా దారి లో పొంచి ఉన్న ప్రమాదం 
ఇంకెలా నిన్ను పొందగలను, నీ కారుణ్యమే చూపాలి ప్రకాశం

ఎక్కడ దొరికేను నీ దరి తప్ప నా మనసుకు ప్రశాంతం
ఇంకెక్కడ కలిగేను నీ పదముల చెంత తప్ప
నా ఆత్మకు ప్రశాంతం

ఓం శ్రీ సాయిరాం 🙏🙏🙏

-తేజ

6 సాయి దీక్ష

బాబా...
మా కర్మలకు ప్రతిఫలంగా పొందాము
ఈ జన్మజన్మలను శిక్షగా

నిన్నే నమ్మిన మాపై కురిపించవా
నీ కారుణ్యాన్ని భిక్షగా

అన్ని విధాలా నువ్వే దిక్కై
అండగా ఉండవా మాకు రక్షగా

కష్టాల కడలిగా సాగే మా జీవిత సమరంలో
నిలబడవా మా పక్షగా

నీ పాదాలనే నమ్మి ముందుకు సాగుతున్నాము
శ్రద్ధ సబూరీ దీక్షగా

ఓం శ్రీ సాయిరాం 🙏🙏🙏
- తేజ

101 సాయి నన్ను విడువకు

  సాయి... నేను పలకరించడం లేదని నువ్వు నాతో మాట్లాడటం మానేయకు సాయి...నా ప్రతి మాట మాటలో నీవే నిండి ఉండోయి  నేను నిన్ను తలవడం లేదని నువ్వు నన్...